Jun 09,2023 16:55

ప్రజాశక్తి - ఉండ్రాజవరం(తూగో): జున్ నెల మొత్తం మలేరియా నివారణ మాసొత్సవం గా నిర్వహించడం జరుగుతుందన్నారు తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు. శుక్రవారం ఉండ్రాజవరం పి.హెచ్.సి., గ్రామ సచివాలయం పరిధిలోని  ఏరియాలో ఫ్రైడే డ్రై డే, వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాక్టివిటీస్ ను ఆయన  క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలేరియాను వ్యాప్తిచేసే ఎనాఫిలస్ దోమ కూడా నిలకడగా ఉన్న నీటిపై గుడ్లు పెడుతుందని, ఇవి 8 నుండి 10 రోజులలో దోమలు గా మారతాయని, ఇవి రాత్రిపూట కుడతాయన్నారు. ప్లాస్మొడియం పరాన్నజీవి తో సంక్రమణం చెందిన ఈ ఎనాఫీలస్  ఫిమేల్ దోమలు కుట్టడం వలన మలేరియా వస్తుందన్నారు. చలి,జ్వరం, వణుకు ఈ వ్యాధి లక్షణాలు గా ఉంటాయన్నారు. ఈ దోమలు పుట్టకుండా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే గా పాటించాలని. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటరాజు, గ్రామ ఆరోగ్య కార్యదర్శి మేరీ రాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.