May 19,2023 15:51

ప్రజాశక్తి  - ఉండ్రాజవరం : దోమల నివారణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు తణుకు వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వడ్లూరులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి,  సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం,  మురుగు నీరు పారుదలకు ఆటంకం కలగకుండా డ్రైన్ లలో చెత్త వేయకుండా పరిశుభ్రత పాటించడం ద్వారా మాత్రమే దోమల పుట్టుక నిలుపుదల సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జె.శ్రీనివాస్, హెల్త్ సెక్రెటరీ, హెల్త్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.