Sep 22,2023 15:01

ప్రజాశక్తి-గణపవరం : ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతపై గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం గణపవరం వేలంపేట మూడో సచివాలయం వద్ద స్థానికులకు ఫ్రైడే సందర్భంగా గ్రూపు సమావేశాలు నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి సంతోష్ నాయుడు పి కిరణ్మయి మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికినీరు చెత్త చదరాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు పెరగవని అన్నారు. దోమలు పెరిగితే అవి కొట్టడం వలన డెంగ్యూ మలేరియా రోగాలు వస్తాయని చెప్పారు స్థానికులు ఇళ్ల వద్ద పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా పాత టైర్లు కొబ్బరి చిప్పలు పూలకుండీలలో నీరు నిలవలేకుండా చూసుకోవాలని అన్నారు ఇంటికి దూరంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం సరిపల్లి సచివాలయం గణపవరం మూడు సచివాలయంలో ఉన్న ప్రజలకు జగనన్న వైద్య సురక్ష కార్యక్రమంలో సందర్భంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులకు బీపీ షుగర్ నిర్వహించారు. వివిధ రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న వారిని వైద్య శిబిరానికి పంపడానికి వీలుగా వారికి టోకెన్లు అందజేశారు గ్రామాల్లో ఈ సర్వే పదిహేను రోజులు పాటు ఉంటుందని ఆ తర్వాత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని డాక్టర్ సంతోష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ జాలాది, విల్సన్ బాబు, హెచ్ వి పద్మజ, హెల్త్ అసిస్టెంట్లు ఎం యాహన్, ఏ కృష్ణ, ఎం నల్లయ్య, ఏఎన్ఎం జయమ్మ, పి దేవిక పాల్గొన్నారు.