Apr 02,2023 16:49

ప్రజాశక్తి-చాగల్లు : ఎన్టీఆర్ ట్రస్ట్ వారి కోడూరు సుబ్బారావు మరియు రామకృష్ణ జ్ఞాపకార్థం కోడూరి శ్రీనివాస్ సహకారంతో చాగల్లు మండలం నెలటూరు గ్రామంలోని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కొత్తపల్లి రవికుమార్ ప్రారంభోత్సవ ఇచ్చారు. వైద్య శిబిరంలో రాజమండ్రి జిఎస్ఎల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వివిధ రకాల సంబంధించి సుమారు 12 వందలు మందికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి  కె.ఎస్ జవహర్ జొన్న గడ్ల  చౌదరి  కోడూరి ప్రసాద్ కరుటూరి సతీష్  వేగి చిన్న, చాగల్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పిచ్చుకల సత్తులు మదర్ తెరిసా ఫౌండేషన్ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్, గ్రామ బీసీ నాయకులు శ్రీనివాస్ పొట్రు సిద్దు, పొట్రు కృష్ణ మోహన్, తాళ్ళూరి ప్రసాద్, లైన్స్ క్లబ్ సభ్యులు స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.