Oct 16,2023 14:48

ప్రజాశక్తి -  ఉండ్రాజవరం : పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల, సౌజన్యంతో, సోమవారం ఉండ్రాజవరం బౌద్ధధమ్మ పీఠంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా, 18 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమైందని, 13 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్లు వేమగిరి ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి బలానికి  టాబ్లెట్లు, ఐ డ్రాప్స్ ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,  పీఠం సభ్యులు పాల్గొన్నారు.