ప్రజాశక్తి -కోరుకొండ: అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు మూడు పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన సోమవారం కోరుకొండ లో చోటుచేసుకుంది.స్థాని బస్టాండు సమీపంలో నరసాపురం పోవు మార్గం మలుపులో డ్రైనేజీవద్ద అకస్మాత్తుగా మంటలుచెలరేగడంతో ప్రక్కనే ఉన్న మూడు పూరిగుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.కొవ్వూరి లోవరాజు కుటుంబ ఒక గుడిసెలో నివశిస్తుండగా,మరొకటి పీతా సుబ్రహ్మణ్యంకు చెందిన కమ్మరిపాక కాగా మూడవ గుడిసెలో చింతా నారాయణ రావుకు చెందిన పండ్లు పూల దుకాణం నడుపుతున్నాడు.రాజమహేంద్రం నుండి ఒకఫైరింజన్ ,సమీప గుమ్మళ్ళదొడ్డి నుండి మరొక మరొక ఫైరింజిన్ వచ్చి మంటలను అదుపుచేశాయి.










