Jan 28,2023 15:06

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఎంపీడీవో గా జిల్లా కలెక్టర్ చేతుల ద్వారా ఉత్తమ అవార్డు స్వీకరించిన ఉండ్రాజవరం ఎంపీడీవో ఏ శ్రీనివాస్ ను సత్కరించడం తమ  వడ్లూరు గ్రామ పంచాయతీకి గర్వకారణమన్నారు సర్పంచ్ రఘు మండ తేజశ్రీ. శనివారం హౌసింగ్ డేను పురస్కరించుకుని, వడ్లూరు హౌసింగ్ లేఔట్ లో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయనకు లబ్ధిదారుల సమక్షంలో ఘన సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో రఘుమండ శ్రీనివాస్,  కటారి సిద్ధార్థ రాజు,  గ్రామ నాయకులు, పంచాయతీ కార్యదర్శి ఎస్ భూపతి, హౌసింగ్ ఏఈ ఎం విక్టర్ బాబు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.