ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా చివటంలో వివిధ రకాల సమస్యలపై వచ్చిన 70 మంది పేషంట్లకు పరీక్షలు నిర్వహించినట్లు ఉండ్రాజవరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ ప్రసాద్ తెలిపారు. వీరిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, మెల్లిటస్, బిపి, షుగర్, జనరల్, ప్రసవానంతర పరీక్షలు, ఇళ్ళ వద్దకు వెళ్లి మంచం పట్టిన పేషంట్లను పరీక్షించినట్లు తెలిపారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి విజయ కుమారి, ఏఎన్‌ఎమ్ సూర్య కుమారి, డి ఈ ఓ శ్రవణ్, హెల్త్ అసిస్టెంట్ డి సుబ్రహ్మణ్యం, ఆశాలు విజయ, సుజాత, లక్ష్మీదేవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.










