ప్రజాశక్తి - ఉండ్రాజవరం: పట్టణాలకు దూరంలో ఉన్న గ్రామాలలో ప్రభుత్వం 104 సంచార వాహనం ద్వారా గ్రామాలలో నిర్వహించే వైద్య సేవలు రోగులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయన్నారు ఉండ్రాజవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఆర్ ఉషాదేవి. మండలంలోని సత్యవాడ సచివాలయం పరిధిలోని చిలకపాడు గ్రామములో మంగళవారం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాంలో సుమారు 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందించారు. పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు, ఎత్తు, బరువులు చూసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జె. శ్రీనివాసు, హెల్త్ విసిటర్ కె. నాగమణి, ఎం.ఎల్. హెచ్. పి.పి.బ్యూలా జోయ్, ఎఎన్ఎం సీ.హెచ్.దుర్గామల్లీశ్వరి, హెల్త్ అసిస్టెంట్ బి.శ్రీనివాసు, డి.ఈ. ఒ ఎస్. శ్రావణ్ కుమార్, ఆశా కార్యకర్తలు బి. నాగమణి, ఎ. ప్రభావతి, కె. సంధ్యా రాణి, ఎన్. లక్ష్మి పాల్గొన్నారు.










