May 22,2023 15:57

ప్రజాశక్తి-పెరవలి : మండలం (తూర్పుగోదావరి జిల్లా) కానూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో గల ఉసులుమర్రు  గ్రామ సచివాలయం నందు సోమవారం ఫ్యామిలీ ఫిజీషిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. గ్రామంలో గల 14 మంది గర్భిణీ స్త్రీలు,86 బిపి 59 షుగర్ వ్యాధిగ్రాస్తులను,93 సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్న వారికీ చికిత్స అందజేశారు. అంగన్వాడీ కేంద్రంను బెడ్ రెస్ట్  లో గర్భిణీ స్త్రీలను, బాలింతలను గృహ సందర్శనం లో భాగంగా వైద్యాధికారిణి డాక్టర్ P. తేజశ్రీ  వైద్య సేవలను, సలహాలు  ఎండ తీవ్రంగా ఉన్నందున  వడదేబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి వీరమళ్ళు నాగలక్ష్మి పీహెచ్సీ,  సూపెర్వైజర్స్  ఏ.జే. సంధాని,. కె.వి నాగేశ్వరరావు, ఎం ఎల్ హెచ్ పి .జ్యోతి కుమారి, హెల్త్ అసిస్టెంట్ జి. దుర్గా ప్రసాద్, ANM సి హెచ్ .అక్కమ్మ,104  డీఈవో సి.హెచ్. అరుణ కుమారి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.