Jul 22,2023 12:06

ప్రజాశక్తి-మండపేట (తూర్పు గోదావరి) : మండపేట మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ చుండ్రు శ్రీ వర ప్రకాష్‌ భార్య చుండ్రు సరిత (44) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా కాన్సర్‌ తో బాధపడుతున్న ఈమెకు హైదరాబాద్‌, చైన్నై, బెంగుళూర్‌ లలోని ఆసుపత్రులలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తుండగా రాత్రి 9 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అమెరికాలో చదువుకుంటున్న వీరి కుమారుడు రాజీవ్‌ కిరిటీ ఇండియా రావాల్సి వుంది. కుమారుడి రాక అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.