Apr 05,2023 15:55

ప్రజాశక్తి-రాజానగరం : పేదలు కట్టుకున్న ఇళ్లపై అధికారులు, పోలీసులు జులుం చూపించారు. ప్రాక్టీనర్తో ఇల్లను కూల్చి అడ్డు వచ్చిన బాధితలను సచివాలయం సిబ్బంది, పోలీసులు ఊడ్చుకుంటూ రోడ్డు పడేశారు. అధికార యంత్రాంగం ధనిక వర్గాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏ మేరకు కొమ్ము కాస్తున్నారు అనేది మండల ప్రధాన కేంద్ర రాజానగరంలో జరిగిన ఈ సంఘటన అద్దం పడుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని సూర్యారావు పేటలో సుమారు ఐదు ఎకరాల నాలుగు సెంట్లు చల్లయ్య చెరువు ఉంది. దీనిని అనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. చెరువు ఆయుకట్టుకు సమీపంలో సుమారు 80 సెంట్ల భూమి మాజీ సైనిక ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చినట్లు ఈమేరకు తమ దగ్గర రికార్డు ఉండడం వలన ఇల్ల నిర్మించుకుంటున్నామని మాజీ సైనిక ఉద్యోగి వారుసులు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో చెరువు సమీపంలో ఆక్రమణలకు గురైంది. వెంటనే ఖాళీ చేయాలని గ్రామ పంచాయతీ అధికారులు మాజీ సైనిక ఉద్యోగుల వారసులకు నోటీస్ లు జారీ చేశారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయిచామని దీనికి సంభంధించిన ప్రతులను మండల రెవెన్యూ అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు ఇచ్చిన్నారు. ఈలోగా బుధవారం ఉదయం భారీ ప్రాక్టీనర్తో పోలీసు సిబ్బంది, గ్రామ సంచివాలయం సిబ్బంది వచ్చి ఒక్కసారిగా మాజీ సైనిక ఉద్యోగి వారసులు నిర్మించుకుంటున్న ఇల్లను కూల్చి వేశారు. దీనికి అడ్డు వచ్చిన మాజీ సైనిక ఉద్యోగి వారసులను సచివాలయం సిబ్బంది, పోలీసులు బరా బరా ఈడ్చుకుంటూ పోయారు. అధికారులు కనుసైగల్లో సచివాలయం సిబ్బంది పోలీసులు  మాజీ సైనిక ఉద్యోగి వారసులు పై దౌర్జన్యం చేసి అన్యాయంగా మెడ పట్టుకుని జుట్టుతో ఊడ్చుకుంటూ దుర్భషషలాడి ప్రక్కకు లాగేశారు. అయినా సరే బాధితులు ప్రాక్టీనర్కు అడ్డంగా ఉంటూ ప్రాణాలైనా వదులుతాము కానీ నిర్మాణంలో ఉన్న ఇల్ల కూల్చివేతను అడ్డుకుంటామని సచివాలయం సిబ్బంది, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. సుమారు రెండు గంటల అధికార పఠాలం అడ్డుకున్న మాజీ సైనిక ఉద్యోగి వారసులు లాక్కుని పోవడంతో నిర్మాణం చేసుకున్న ఇల్లను కూల్చివేశారు. పునాదుల్లో మట్టిని చెల్లాచెరుగా పడేసి ఇటక గోడ్డలను ప్రాక్టీనర్లో తొలగించారు. చెరువు గట్టుకు ఆనుకుని ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 60 అడుగుల రోడ్డు వేయడానికి తమ ఇల్ల అడ్డుగా ఉండడం వలన తొలగించారని  మాజీ సైనిక ఉద్యోగి వారసులు ఆరోపిస్తున్నారు. దీనిపై మాజీ సైనిక ఉద్యోగి వారసుల కుటుంబ సభ్యురాలు పలివెల కృష్ణవేణి మాట్లాడుతూ మాజీ సైనిక ఉద్యోగి. మా తాతగారికి ప్రభుత్వం ఇచ్చిందని, దీనిని ఏళ్ల తరబడి సాగు చేసుకుని బ్రుతుకున్నామన్నారు. ప్రభుత్వం మా తాతకి ఇచ్చినట్లు తమ దగ్గర  పత్రాలు ఉన్నాయని, ఈమేకు కోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. కోర్టు ప్రతులను రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు అందజేసినా కట్టుకున్న ఇల్లను కూల్చి వేశారని కన్నీటిపర్యాంతమై ఆవేదన చెందారు. సమీపంలో రియల్ ఎస్టేట్ భూమికి 60 అడుగుల రోడ్డు మేము నిర్మించుకుంటున్న ఇల్ల అడ్డుగా ఉండడం వలన కూల్చిశారని ఆరోపించారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ బాబును వివరణ కోరగా చల్లయ్య చెరువు ఆక్రమణ చేసి ఇల్ల నిర్మాణం చేస్తుడడం వలన కూల్చి వేశామని చెప్పారు.