ప్రజాశక్తి - నిడదవోలు
ఎస్‌సి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాన్ని తొలగించి వెంటనే కమ్యూనిటీ హాల్‌ను అప్పగించాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు జువ్వల రాంబాబు, పట్టణ నాయకులు డొంకా రమేష్ మాట్లాడారు. దళితులు కోసం 2018లో సుబ్బరాజుపేటలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు రూ.35 లక్షలతో ఎస్‌సి కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించారన్నారు. ఈ భవనంలో వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో దళితులు సమావేశాలు, శుభకార్యాలను నిర్వహించుకునేందుకు నాలుగేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారనానరు. ప్రభుత్వం సేవలు అందించే వంకతో దళితులకు కేటాయించిన భవనాల్లో సచివాలయం ఏర్పాటు చేయడం తగదన్నారు. తక్షణమే భవనాన్ని దళితులకు అప్పగించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.










