Mar 01,2023 22:04

ప్రజాశక్తి-నిడదవోలు నిడదవోలు ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌ నాయుడు కుమార్తె రిషప్షన్‌ వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. నిడదవోలు సుబ్బరాజుపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద సిఎం జగన్‌కు ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌నాయుడు, జిల్లా కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి సుధీర్‌కుమార్‌, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జెడ్‌పి చైర్మన్‌లు విప్పర్తి వేణుగోపాల్‌, కవురు శ్రీనివాస్‌, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా చైర్‌పర్సన్‌ షర్మిలా రెడ్డి, ప్రభుత్వ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మర్గాని భరత్‌ రామ్‌, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.