Aug 12,2023 23:33

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో ఎలక్షన్‌ అటెన్షన్‌ మొదలైంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ మేరకు కసరుత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసేనాటికి ముందు సంసిద్ధత అవుతున్నారు.ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసే దిశగా ముమ్మర కషి జరుగుతోంది. ఉన్నతాధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనలు చేపడుతున్నారు.ఎస్‌ ఎస్‌ ఆర్‌ ప్రక్రియలో భాగంగా జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ బి.ఎల్‌.ఓ.ల ఇంటింటి పరిశీలన, అక్టోబరు 17 న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అక్టోబరు 17 నుండి నవంబరు 30 వరకూ క్లైమ్‌ లు మరియు అభ్యంతరాల స్వీకరణ అనంతరం క్ల్లెయిమ్‌ లు అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో బూత్‌ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. డిశంబరు 26 కల్లా క్లైమ్‌ లు మరియు అభ్యంతరాల పరిష్కరించి జవనరి 5 న తుది ఓటర్ల జాబితా ప్రచురించేందుకు కసరత్తు జరుగుతోంది. హొ ఇప్పటికే జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారుల నియామకం కూడా పూర్తయిన విషయం హొవిదితమే.హొ
ఓటర్ల జాబితా సవరణ
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకారం వచ్చే అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 18 సంవ త్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హత కలిగిన దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హొజూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బిఎల్‌yఒలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించనున్నారు. జిల్లాలో 2023 ఎస్‌ ఎస్‌ ఆర్‌ ప్రకారం 1550944 ఓటర్లు ఉండగా, పురుషులు 760565, మహిళలు 790264, ఇతరులు 115 మంది ఉన్నారు. ఎస్‌ ఎస్‌ ఆర్‌ 2024 కు సంబందించి ఇప్పటికే మూడు సార్లు జిల్లా స్థాయిలో, డివిజన్‌, మండల స్థాయి లో సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో 1000 మంది పురుషులకు 1039 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయిలో జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు చేపట్టే హేతుబద్ధీకరణ విధానంలో చేపట్టేందుకు బి ఎల్‌ వో లకు ఆదేశాలు జారీ చేశారు. ఫారం 6, 6 ఏ, 7, 8 లకు చెంది 21576 దరకస్తులు రాగా 11535 ఆమోదించి, 1211 తిరస్కరించగా, 8148 పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటి వరకు కొత్తగా జిల్లాలో 12525 నమోదు కాగా, 12171 తొలగించారు. యువ ఓటర్లు నమోదు కోసం కాలేజీలు, యూని వర్శిటీలో ప్రత్యేక ఎన్రోల్‌మెంట్‌ చేపట్టారు. సాంకేతిక సహాయంతో బోగస్‌ ఓటర్ల ఏరివేత సాగుతోంది. ఆధార్‌ అనుసంధానం సైతం శరవేగంగా చేపడుతున్నారు. ఒకే ఇంటి నెంబర్‌తో పదుల సంఖ్యలో ఉన్న ఓటర్లను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగమైంది. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతున్నారు.హొ
అధికార యంత్రాంగం సమాయత్తం
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నిక లు జరుగనున్నందున అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారుల ప్రక్రియపూర్తయిన విషయం విదితమే. ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఓటింగ్‌ నిర్వహణకు బ్యాలెట్‌ యూనిట్లు (బీయూ), ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (పీవీప్యాట్‌), కంట్రోల్‌ యూనిట్టను రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. బీయూ, ఈ పీవీప్యాట్‌, సియులను క్రోడీకరించి ఓటింగ్‌ నిర్వహించే విధానమే ఈవీఎం పద్ధతి. ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ఈవీఎంను సమకూరుస్తారు. బెంగుళూరు బెల్‌ కంపెనీ నుంచి సరఫరా చేసిన 4930 వివి ప్యాడ్స్‌ హొజిల్లాకు చేరుకున్నాయి. వాటిని రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షములో హొతనిఖీలు చేసి స్ట్రాంగ్‌ రూం గొడౌన్‌ డిపాజిట్‌ చేశారు.వివిధ పార్టీల హొప్రతినిధుల సమక్షంలో ఇప్పటికే ఫస్ట్‌లెవల్‌ కమిటీ (ఎఫ్‌ఎల్‌సి) పరిశీలన ప్రక్రియను సైతం అధికార యంతాంగాలు పూర్తి చేశాయి. అత్యంత కీలకమైన వీవీ ప్యాట్‌లను లాలా చెరువులోని హొస్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు సీ, సీ కెమెరా, 24 గంటల పర్యవేక్షణతోకట్టుదిట్టమైన భద్రతా చర్యలుచేపట్టారు.హొ