Feb 18,2023 16:50

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : పిట్టలవేమవరం  గ్రామం వరి క్షేత్రంలో 18 రకాలు బయోకల్చర్, చేప బెల్లం ద్రావణం  కలిపి సుమారు 50 ఎకరముల వరి పంట పొలాలలో  డ్రోన్ సహాయం తో స్ప్రేయింగ్ పిచికారి చేయడం జరిగినది. డ్రోన్  తో స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు పలువురు రైతులు వచ్చి, ఈ విదానాన్ని పరిశీలించటం జరిగినది. ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్ మహేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులను ప్రతీ రైతు అవలంబించాలని అన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయుటకు ముందుకు రావడం జరుగుతుందన్నారు. యూనిట్ ఇంచార్జ్ బుజ్జి మాట్లాడుతూ పిట్టలవేమవరం గ్రామంలో అనేక మంది రైతులు బయొకల్చర్స్ ఉపయోగిస్తున్నారు.ఈ కార్యక్రమంలో  వెంకట్రావు  విద్యాలత రత్నరాజు  మహేష్ ప్రసాద్ రవి శేఖర్ రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.