Jul 31,2023 16:07

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రూరల్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో పది మందికి సోమవారం నాడు మోటార్ ట్రై సైకిళ్లను రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పంపిణీ చేశారు. దివ్యాంగులకు పూర్తిస్థాయిలో అండగా ఉన్నది జగనన్న ప్రభుత్వమని చందన నాగేశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చందన నాగేశ్వర్ వెల్లడించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ దివ్యాంగుల పింఛన్ రూ.3 వేలు అందించడం జరుగుతున్నదని పేదవారి సంక్షేమం కోసం తపన పడుతూ... సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారికి లబ్ధి చేకూరేలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గానికి పది మోటార్ ట్రై సైకిళ్లు మంజూరు కాగా ఒక్కోదానికి ప్రభుత్వం రూ 90,000/- వెచ్చించిందని చందన నాగేశ్వర్ వివరించారు. ఈ మోటార్ సైకిళ్లను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందన నాగేశ్వర్ తో పాటుగా విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్ధుల సహాయ సంస్థ ఛైర్ పర్సన్  కుమారి.ముంతాజ్ పఠాన్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్, పునరావాస అధికారి వై.శ్రీరామ్, దివ్యాంగుల సలహా కమిటీ జిల్లా మెంబెర్ మేడపాటి బాపిరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు ఆచంట కళ్యాణ్, అత్తిలి భీమశంకరం, సఫారి నాయుడు, తలారి వర ప్రసాద్, హమీద్ బాషా, పెనుమాక సునీల్, తీగిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..