ప్రజాశక్తి-కడియం : మండలంలోని మాధవరాయుడు పాలెం గ్రామానికి చెందిన ఈలి వెంకటేశ్వరరావు (47) బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందారు. వ్యవసాయ కూలీగా పనిచేసే వెంకటేశ్వరావు పనులు ముగించుకుని ఇంటి వద్ద స్నానానికి పైపు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సర్క్యూట్ అయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. నిరుపేదైన వెంకటేశ్వరరావుకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వంత ఇల్లు కూడా లేని వెంకటేశ్వరరావు మృతితో ఆ కుటుంబం రోడ్డు పాలయింది.










