ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న సర్పంచ్
ప్రజాశక్తి - చాగల్లు
మండల కేంద్రమైన చాగల్లులోని ఆర్‌బికె కేంద్రంలో ధాన్యం కనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మనశ్శాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని కాపవరంలో మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని, దీనికి అనుబంధంగా మండలంలోని అన్ని ఆర్‌బికె కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర్, తహశీల్దార్ కె.రాజ్యలక్ష్మి , మండల వ్యవసాయాధికారి కె. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమయ్యే గోనె సంచులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.










