ప్రజాశక్తి-పెరవలి మండలంలోని కానూరులో తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరావు శుక్రవారం పరిశీలించరాఉ. పెండ్యాల ర్యాంపునకు వెళుతున్న సిసి రోడ్డుపై ఉన్న తడిసిన ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే నిర్దేశించిన లక్ష్యాలకు మించి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. మిల్లర్ల ద్వారా అవసరమైన గన్నీ బ్యాగులను సేకరిస్తున్న చెప్పారు. ఆయన వెంట పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, జెసి తేజ్ భరత్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, తహశీల్దారు టి.రాజేశ్వరి ఎంపిపి కె.సీతారామ్ ప్రసాద్, కొమ్మిశెట్టి రాము, అనపర్తి సత్తిపండు, కరుటూరి గోపి, తోట సురేష్ పాల్గొన్నారు.










