ప్రజాశక్తి-బిక్కవోలు : 40 సంవత్సరాలుగా దళితులకు జీవనోపాధారంగా ఉన్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని జై భీమ్ మాల మహానాడు అధ్యక్షులు తంతటి కిరణ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లా చిన్నారావు డిమాండ్ చేశారు. బిక్కవోలు మండలం మెల్లూరు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా దళితుల ఆధీనంలో ఉంటూ దళితుల జీవనోపాధిగా ఉంటున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు తాసిల్దార్ కి దళిత సంఘాల ఆధ్వర్యంలో మేల్లూరు దళిత పెద్దలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు కిరణ్, చిన్నారావు మాట్లాడుతూ దళితులు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా భూమికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదగిరి రాజబాబు, మచ్చ మణికుమార్, నేల వీర్రాజు, దావీదు, వెంకటేశ్వరరావు, నెల్లూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తహసీల్దార్ కి ఇనతి పత్రం అందజేస్తున్న దళిత నాయుకులు.










