Apr 16,2023 15:01

ప్రజాశక్తి-పెరవలి : మండలం కానూరు నడిపల్లి గ్రామపంచాయతీ ల పరిధిలో ఉన్న పంచాయతీ ప్రైవేట్ చెరువుల లో  ఫంగస్ ఇతర చేపలు రైతులు సాగు చేస్తున్నారు  ఎక్కువగా ఫంగస్ చేపలు లాభాలు రావటంతో కొంతమంది రైతులు దీనిపై ముగ్గు చూపి వీటికి ఆహారంగా కోడి వ్యర్ధాలు చనిపోయిన కోళ్లను ఆయా చెరువుల వద్ద ఉడకబెట్టి చేపలకు  వేస్తున్నారు ప్రస్తుతం వేసవి సీజన్ ఎండ తీవ్రత 40 దాటి ఉండటంతో వీరికి ప్రతినిత్యం చనిపోయిన కోళ్లు ఇబ్బంది లేకుండా తక్కువ ధరకు రావడంతో చేపలకు ఆహారంగా వేస్తూ కాసులు గడిస్తున్నారు మండలంలోని కోళ్ల ఫారాలు ఎక్కువ ఉండటంతో  వేసవిలో చనిపోయిన కోళ్లకు కొదవ లేకుండా ఉంటుంది యథేచ్చగా కొంతకాలంగా ఆయా ప్రాంతాల చెరువుల వద్ద ఈ తంతు జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూసే దాక లాలు లేవని పలువురు అంటున్నారు

            గత కొంతకాలంగా మండలంలోని హోల్ సేల్ కోడి మాంసం దుకాణాల వద్ద నుండి కోడి వ్యర్థ పదార్థాలను కొంతమంది వ్యాపారస్తులు తీసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి చెరువుల వద్ద అమ్మకాలు సాగిస్తున్నారు ఈ కుళ్ళినకు కోడి వ్యర్ధాలునూ చెరువుల్లో చేపలకు ఆహారంగా వేయటం వల్ల అవి తినే వారు రోగాల బారిన పడుతున్నారు అధికారులు ఇకనైనా దృష్టి పెట్టి కోడి వ్యర్ధాలు చనిపోయిన కోళ్లు తీసుకుని వెళ్లే వాహనాలను అదుపులో తీసుకోవాలని పలువురు కోరుచున్నారు కోళ్ల ఫారం యజమానులు వేసవి తాపానికి చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి మట్టిలో కప్పి పెట్టాలి అలా చేయకుండా చెరువుల యజమానులకు తక్కువ ధరకు అమ్మ కాలు సాగిస్తూ ఉండటంతో చెరువుల యజమానలకు చనిపోయి కుళ్ళిన కోళ్లు తీసుకుని వచ్చి యదేచ్ఛగా చేపలకు మేతగా వేస్తూ దందా సాగిస్తున్న పట్టించుకునే నాధుడు లేడు