ప్రజాశక్తి-గోకవరం : దసరా పండగను పురస్కరించుకుని మండల కేంద్రమైన గోకవరం డిపో నుండి స్పెషల్ బస్ లు ఏర్పాటు చేసినట్లు శనివారం డిపో మేనేజర్ యు.రామన్న దొర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి ప్రతీరోజూ గోకవరం డిపో నుండి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్ లు బయలుదేరుతాయని, గోకవరం డిపో పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్ లు స్పెషల్ గా కావాల్సిన వారు డిపో సూపర్డెంట్ అప్పారావు కలవాలని తెలిపారు.మరిన్ని వివరాలకు ఫోన్ నంబరును :6281070787 సంప్రదించాలని కోరారు.










