ప్రజాశక్తి-పెరవలి మండలం(తూర్పుగోదావరి జిల్లా) : ఖండవల్లి జాతీయ రహదారి ప్రక్కన ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యప్రదర్శన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమీ కుమారి నరుకుల సాయిశ్రీప్రియ తన శిష్యబృంధంతో ప్రదర్శించిన నర్తన గణపతిం, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీనివాస కళ్యాణం, మహిషాసురమర్దిని స్తోత్రం, అమ్మోరు మొదలగు నృత్యరూపకాలను ప్రేక్షకులు విశేష అమితానందంతో వీక్షించి నర్తకీమణులను ఘనంగా అభినంధించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మైపాల ప్రసాద్ కమిటీ సభ్యులు కళాకారులను అభినంధించి సత్కరించారు.










