Mar 31,2023 23:27

నిరసన తెలుపుతున్న దళితులు

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
దళితులపై దాడులకు నిరసనగా మద్దూరు అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వమించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో రోజురోజుకూ దళితులపై దాడులు పెరిగిపోతు న్నాయన్నారు. ప్రశ్నించే దళితులు, నాయకులు, సామాజిక ఉద్యమకారులపై నిర్భందం ప్రయోగిస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కోనసీమలో అంబేద్కర్‌ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసం సష్టించిన శక్తులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేయడమే కాకుండా నాయకుల్ని సాక్షాత్తు సిఎం జగన్‌ ఆలింగనం చసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇది దళితుల్ని అవమానించడ మేనన్నారు. శృంగవృక్షంలో హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించకుండా దళితులను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మరపట్ల రాజు, ఆనంద్‌, రమేష్‌, నాని, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.