ప్రజాశక్తి - సీతానగరం దళితుల సమాధులను బ్లేడు ట్రాక్టర్‌తో దున్ని పట్టిసీమ తిరనాళ్ల యాత్రికుల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారని వంగలపూడి వాసులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపైన ఇలాంటి కుల వివక్ష ఏంటని అడిగితే పెత్తందారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. సాంప్రదాయం ప్రకారం ఏటా తమ బంధువుల సమాధుల వద్దకు వెళ్ళి జ్ఞాపకార్థంగా సంవత్సరికాలు చేసుకోవడానికి వీల్లేకుండా 20 సమాధులను తొలగించారని బాధితులు వాపోయారు. కావాలనే పంచాయితీ అధికారులు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారన్నారు. ఈ అన్యాయంపై జిల్లా అధికారులు, పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సమాధుల రక్షణ కోసం పూర్తిస్థాయిలో రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో అన్ని దళిత సంఘాలతో కలిసి దీక్ష చేపడతామని అన్నారు. ఈ విషయమై ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మాట్లాడిన వారిలో ఇండిగమెల్లి శ్రీను, ఇండిగమెల్లి వెంకట శ్రీనివాసరావు, ముప్పిడి ప్రభాకర్‌రావు, ఇండిగమెల్లి వెంకటేశ్వర్లు, తవిటికి చిట్టియ్య, తవిటికి కష్ణ, చిడిపి సత్యనారాయణ, చిడిపి బాలకష్ణ, ఇండిగమెల్లి రమేష్, ఇండిగమెల్లి నల్లయ్య, కోడెల్లి శ్రీను, కోడెల్లి కన్నయ్య, చిర్రా వీర్రాజు, ఇండిగమెల్లి బాలాజీ, కుమ్మర చంటి, కోడెల్లి రాముడు, ఇండిగమెల్లి చిన్ని, కోడెల్లి శివ పాల్గొన్నారు.










