ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వం విద్యా విధానంలో నూతన ఆవిష్కరణలు చేపట్టడం ద్వారా విద్యార్థులకి మరింత నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం బొమ్మురు జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతి బోధన పద్ధతులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మెరుగైన విద్యను అందించే క్రమంలో ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, సకాలంలో అందచేస్తున్నట్టు తెలిపారు. నాణ్యమైన బోధన పద్ధతులు, డిజిటల్ 10 వ తరగతి పిల్లలకు డిజిటల్ రూపంలో బోధన చేస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా ప్రణాళిక, అమలు చేయడం కోసం కష్ట పడటం కూడా చాలా ముఖ్యం అన్నారు. అంతర్జాతీయ విధానంలో డిజిటల్ రూపంలో తరగతి గదు లను ఆదినిక ఠరించడం జరిగిందన్నారు. నేడు అంతర్జాల వ్యవస్థ అందుబాటులో ఉన్నాయని, వాటి సాంకేతికత ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా తల్లి తండ్రుల పిల్లల ఆలోచనలు గుర్తించి ప్రోత్సహం అంద చెయ్యవలసి ఉంటుందని, పిల్లలు కూడా సవాళ్లు ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. గతంలో రాగులు జొన్నలు సజ్జలు వంటి ఆహార అలవాట్లు కేవలం పేద కుటుంబం వారి కోసం మాత్రమే అనే అపోహ ఉండేదని కలెక్టర్ కె.మాధవీలత తెలియ చేశారు. పిల్లలు కూడా మంచి పోషకాలతో కూడిన రాగి జావ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డిఇఒ ఎస్.అబ్ర హాం తదితరులు పాల్గొన్నారు.










