చప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో మంగళవారం నిర్వహించిన నులిపురుగుల నివారణ దినం విజయవంతం మైంది. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలను భోజనం తరువాత మింగించారు. కడియం మండలంలో అన్ని విద్యాసంస్థల్లో నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించారు. కడియం-1 ప్రాథమిక పాఠశాలలో ఎంఇఒ వి.లజపతిరారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 16,724 మందికి లక్ష్యం కాగా, తొలి దశలో 95శాతం పూర్తి చేశామని లజపతిరారు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది బి.సునీత, పి.కుసుమ, హెచ్‌ఎం కె.లక్ష్మణకుమార్ పాల్గొన్నారు. ఉండ్రాజవరంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ సెంటర్లు, ఇళ్ల వద్ద ఉన్న చిన్నారులతోనూ మాత్రలను మింగించారు. కొవ్వూరు డిప్యూటీ డిఎంహెచ్‌ఒ జి.వరలక్ష్మి, ఎంపిడిఒ ఎ.శ్రీనివాసరావు, ఎంపిపి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పిహెచ్‌సి వైద్యాధికారి రాజనాల ప్రసాద్, సిహెచ్‌ఒ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చాగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డీవార్మింగ్ డేను నిర్వహించారు. మాత్రలు మింగని వారికి ఈ నెల 18న మాత్రలు వేస్తామని పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ తనూజ తెలిపారు. గోకవరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు, కళాశాలల్లో జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవాన్ని కొత్తపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది మేరీ కృప, ఎంపిహెచ్‌ఇఒ వైఎస్.రాయుడు శైలజ, తహశీల్దార్ ఎ.శ్రీనివాస్, ఇఒపిఆర్‌డి ఎం.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నల్లజర్లలో నులి పురుగుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ ఎస్‌ఆర్‌కె కెఎస్‌ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ కంఠమణి నారాయణప్రసాద్ అన్నారు. ఎస్‌ఆర్‌కె కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పిల్లలతో అల్బెండజోల్ మాత్రలు మింగించారు. మొత్తం 14,258 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.సుబ్రహ్మణ్యం, పూర్వపు ప్రిన్సిపల్స్ బి.వెంకటేశ్వర్లు, ఎన్.సత్యనారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్.కిరణ్‌కుమార్, ఆరోగ్య కార్యకర్త సిహెచ్‌జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, సిహెచ్‌ఒ ఎం.కృష్ణుడు, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫణి శేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. గోపాలపురం హుకుంపేట, అన్నదేవర పేట పరిధిలోగల విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు వేశారు. వేళ్లచింతలగూడెం ఎంపియుపి పాఠశాల హెచ్‌ఎం రత్నమణి, గుడ్డిగూడెం ఎంపిపి స్కూల్ హెచ్‌ఎం వీరభద్రుడు మాట్లాడుతూ నులిపురుగుల నివారణతో రక్తహీనత లోపాన్ని నివారించొచ్చన్నారు. మండలంలోని అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్ ఎం.ప్రమీల, సిఆర్‌పి కొయ్య నాగరాజు, త్రిమూర్తులు, మంజుల, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పెరవలి.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 7,142 మందికి 6,627 మంది పిల్లలకు ఆల్బండజోల్ మాత్రలు వేశారు. 92 శాతం సాధించామని వైద్యాధికారులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సత్యకృష్ణవేణి తెలిపారు. ఎంపిడిఒ ఎస్.రమేష్, ఎంఇఒ వెలగల హైమావతి సర్పంచులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.










