Aug 09,2023 23:01

ప్రజాశక్తి-ఆలమూరు
వైద్యాధికారి డాక్టర్‌ ఎమ్‌.సమతల సేవలు అభినందనీయమని ఎంపిపి, పిహెచ్‌సిల ఛైౖర్మన్‌ తోరాటి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి సభ్యుడు తోరాటి సీతామహాలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని చొప్పెల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్‌ దంగేటి చంద్రకళ బాపనయ్య అధ్యక్షతన డాక్టర్‌ సుమలతకు వీడ్కోలు, సత్కార సభ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ స్థానిక పిహెచ్‌సి ద్వారా రోగులకు డాక్టర్‌ సుమలత చేసిన వైద్యసేవలనుకొనియాడారు. డాక్టర్‌ సుమలత కొత్తపేట మండలం అవిడి పిహెచ్‌సికి బదిలీ అయ్యారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌, సర్పంచ్‌ తమ్మన శీనివాస్‌, సర్పంచులు గుణ్ణం రాంబాబు, దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు, ఎఎంసీ ఛైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, వైసిపి నేతలు వాసన పోతురాజు, జాంపోలు మాణిక్యం, దియ్యన పెద్దకాపు, దొండపాటి చంటి తదితరులు పాల్గొన్నారు.