Apr 03,2023 23:27

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం న్యాయవాది దుంగిరాల సుభాష్‌పై పోలీసులు చేసిన దాడి అమానుషమని, తక్షణమే కారకులైన ఎస్‌ఐ నారాయణ స్వామి, ఇతర సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని ఎపి బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సోమవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పెద్దఎత్తున నగరంలోని త్రీ టౌన్‌ పోలీష్‌ స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేశారు.