ప్రజాశక్తి-చాగల్లు : సైకిల్ త్రొక్కటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైకిళ్ళు త్రొక్కాలని బ్రాహ్మణగూడెం పిహెచ్ సీ వైద్యాధికారి కే నిషిత అన్నారు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కే నిషిత ఆధ్వర్యంలో సైకిల్ త్రోక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడానికి శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన కూడలిలో సైకిల్ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా సైకిల్ త్రొక్కడం వల్ల కండరాల యొక్క దృఢత్వాన్ని పెంచుకోవచ్చని శరీరంలోని అవయవాలు కదలిక మెరుగుపరుచుకోవచ్చని ఎముకలను దృఢపరుచుకొని శరీరాకృతిని పెంపొందించుకోవచ్చునని అధిక క్రొవ్వును కరిగించుకొనవచ్చునని తెలియజేశారు. ఈ సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎం శ్రీనివాసరావు, రాజశేఖర్, టీవీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు










