Feb 10,2023 16:25

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: ఎలుకల వలన రైతులు తమ, తమ పంటలను నష్టపోరాదనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సామూహిక ఎలుకల నివారణ మందును ఉపయోగించి,  రైతులు అధిక ఫలసాయాన్ని పొందాలన్నారు ఉండ్రాజవరం ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి. శుక్రవారం సామూహిక ఎలుకల నివారణ మందు ఉచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆమె పాలంగి  ఆర్.బి.కె కార్యాలయంలో  పాల్గొని ప్రసంగించారు. మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద బ్రోమోడయోలిన్ , ఎలుకల మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా  నూకలు నూనె కలిపిన ఎలుకల మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఉండ్రాజవరం సర్పంచ్ మెండే వెంకట్రావు, ఆయా గ్రామాలలో పాలంగి సర్పంచ్ బొక్కా శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు,  ఉండ్రాజవరం మండలం సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు, దమ్మెన్ను గ్రామ సర్పంచ్ గురజర్ల  వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శి భార్గవి దేవి, సూర్యారావు పాలెం మెండే లలిత కుమారి, వైఎస్ఆర్సిపి నాయకులు,  ఎంపీడీవో ఏ. శ్రీనివాస్, చివటం  లో కార్యదర్శి కే కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి మీసాల విశ్వాస రావు, విస్తరణ అధికారి అశోక్, గణేష్  గ్రామ విస్తరణ అధికారులు నాగమణి, జగదీశ్వరి , ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.