ప్రజాశక్తి -కడియం : మండలంలోని మురమండ గ్రామం నుండి దుళ్ల - వీరవరం ప్రధాన రహదారికి వెళ్ళు నందీశ్వర స్వామి పుంత రోడ్డులో జరుగుతున్న ఎడ్ల పట్టు ప్రదర్శన (బండి లాగుడు) పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు.










