Mar 03,2023 15:24

ప్రజాశక్తి - ఉండ్రాజవరం : కువైట్ నుండి వస్తున్న మహిళకు విమానాశ్రయం లో పరీక్షలు నిర్వహించగా వచ్చిన రిపోర్టు ప్రకారం కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు ఉండ్రాజవరం పి.హెచ్.సి డాక్టర్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కువైట్ నుండి మార్చి 1వ తేదీ వచ్చిన మహిళకు విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహించగా, కరోనా నిర్దారణ ఐనట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళకు కరోనా లక్షణాలు ఏమి లేవని, మరోసారి పరీక్షలు నిమిత్తం రేపు సాంపిల్స్ తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచినట్లు డాక్టర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తగా మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించవలసిందిగా తహసీల్దార్ జి. కనకరాజు సూచించారు.