- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మ శ్రీ..
ప్రజాశక్తి-రాజానగరం : బిజెపి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ శ్రీ అన్నారు. రాజానగరంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మ శ్రీ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల సొమ్మును కార్పొరేషన్ సంస్థకు ఇస్తుంది ఆరోపించారు. దీనిని ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతునారు. గాంధీ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ ఎప్పుడూ కేసులకు భయపడే వ్యక్తి కాదన్నా. పేద ప్రజల డబ్బులు అందానికి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని, వెంటనే అతనినితోపాటు కాస్తున్నవారిని కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూధర్, డాక్టర్ వడియార్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎ. శేషగిరిరావు , ముప్పుడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.










