ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : గోదావరి జిల్లా లకు అన్న దాత సర్ ఆర్థర్ కాటన్ దొర 220 వ జయంతి సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ధవళేశ్వరం అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాటన్ మహాశయునికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. .కరువు జిల్లాలకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి 10 లక్ష ల ఎకరాలకు సాగు నీరు అందించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన గొప్ప దార్శినికులని కాటన్ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్. జై కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పాలిక రా జుబాబు, సహ అద్యక్షులు బి.లక్ష్మణుడు, ఇతర నాయకులు పీ.ఎస్. శేషు కుమార్, సయ్యద్ బాజి, సతీష్ కుమార్, శ్రీనివాస రాజు, ఆదిత్య సోమేశ్వర్, వాసుదేవి, ఎన్. వెంకట్రావు, రామకృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.a










