Apr 01,2023 14:39

ప్రజాశక్తి-కడియం : కడియం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న నాడు - నేడు అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలివున్న స్వల్ప పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారునకు సూచించారు. ప్రసూతి వార్డులో స్త్రీలను అందుతున్న వైద్యసేవలపై ఆరాతీసారు. అనంతరం కడియం ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వారు ఆసుపత్రికి సమకూర్చిన సుమారు 30 లక్షల రూపాయలు విలువైన వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతరత్రా సామాగ్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యులు అందజేస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ ఎస్ డాక్టర్ సనత్ కుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, రాష్ట్ర వైసిపి కార్యదర్శి గిరజాలబాబు, తహశీల్దార్ సుజాత, ఎంపిడిఓ రత్నకుమారి, అభివృద్ధి కమిటీ సభ్యులు దొడ్డా బుజ్జి, ఎన్.గణేశ్వర్రావు, ఆసుపత్రి వైద్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.