Feb 24,2023 16:07

ప్రజాశక్తి-గోకవరం : ఫిబ్రవరి నెలాఖరికి ఇంటి పన్నులు పన్నునేతర వంటి పన్నులును నూటికి నూరు శాతం వసూళ్ళు చెయ్యాలని  గోకవరం మండల పంచాయతీ విస్తరణ అధికారి ఏం రాజేశ్వరరావు అన్నారు శుక్రవారం ఇంటి పన్నులు వసూళ్లు డ్రైవ్ లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారిని పి జగదాంబ ఆదేశాల మేరకు మండలంలో ఇంటి పన్నులు తక్కువ శాతం వసూలు ఉన్న పంచాయతీలు వెదురుపాక గోకవరం పంచాయతీలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామా పంచాయతీలలో ఇంటి పన్నుల వసూళ్లు అతి తక్కువ శాతం ఉన్నాయని గోకవరం 50.42% మల్లవరం 52.65% గుమ్మల్లదొడ్డి 42.02% వెదురుపాక 25.83%  లో ఉన్నాయని తక్కువ శాతం ఉన్న గ్రామాలు అలాగే మిగిలిన గ్రామపంచాయతీలలో కూడా ఈనెలాఖరికి నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని తెలిపారు గుమ్మల దొడ్డి వెదురుపాక పంచాయతీ పరిధిలో ఐ ఓ సి ఎల్ హెచ్పిసిఎల్ ప్లాంట్ సంస్థలు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి గండి కొడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు మండలంలో తక్కువ శాతం ఉన్న గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులు వసూళ్ళ విషయంలో  టీములు వేయడం జరిగిందని ఈ టీములపై  ఈఓపిఆర్డి ఏం రాజేశ్వరరావు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు ముఖ్యంగా అతి తక్కువ ఇంటి పన్నులు వసూళ్లు ఉన్న గ్రామాలలో నెలాఖరికి 75% పైబడి పన్నులు వసూళ్ళు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ ఫేనేంద్ర కుమార్ అబ్రహం సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు