Jun 14,2023 15:59

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామానికి చెందిన నక్క జేసన్ విన్సీ జట్ల శివ ఇద్దరు బాలురుకి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఆర్థిక పరిస్థితులు వల్ల వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఈ విషయం స్థానిక ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు దృష్టికి తీసుకురావడంతో తక్షణమే బాధితులను తీసుకొని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు వద్దకు తీసుకొని వెళ్లి పిల్లలు అనారోగ్య పరిస్థితులు వారి ఆర్థిక పరిస్థితులను వివరించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చంటిబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నక్క జెస్సన్ విన్సీ కి1 లక్ష 60వేలు జట్ల శివకి 45వేలు మంజూరు చేయించడం జరిగిందని వీరిద్దరికీ బుధవారం గోకవరం లో వారి కుటుంబీకులకు ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో చెక్కులు ఎమ్మెల్యే చంటిబాబు చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రీ సూరారెడ్డి నరాల శెట్టి నరసయ్య గుల్లా ఏడుకొండలు చింతల అనిల్ కుమార్ మడికి మైనర్ బాబు కర్రీ శివరామకృష్ణ పి సత్యానందం మెహర్ బాబా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.