Feb 05,2023 16:33

ప్రజాశక్తి-చాగల్లు : చంద్రవరం శాఖ గ్రంథాలయంలో విద్యార్థుల కోసం బాల సాహిత్యం పుస్తకాలను పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కోసం కథల పుస్తకాలను బాలల బొమ్మలతో కూడిన రామాయణము భారతం, బొమ్మరిల్లు కథలు అక్బర్ బీర్బల్ కథలు ఆలీబాబా 40 దొంగలు భాగవత కథలు తెనాలి రామకృష్ణ కథలు అరేబియన్ నైట్స్ పిల్లల హాస్య కథలు మొదలగు పుస్తకాలను ఈ ప్రదర్శనలో విద్యార్థులు తిలకించారు నెలలో మొదటి ఆదివారం ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు జరుగుతుందని గ్రంథపాలకులు కే సుమన్ కుమార్ అన్నారు అలాగే ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం కూడా జరుగుతుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఆదివారం గ్రంధాలయాన్ని తప్పకుండా విద్యార్థులు అందరూ సందర్శించాలని కోరారు.