Feb 03,2023 15:09

ప్రజాశక్తి- గోకవరం : ఈనెల 14 ,15 ,16 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా మండల కేంద్రమైన గోకవరం గ్రామం విచ్చేయుచున్నా సందర్భంగా దేవి చౌక్ సెంటర్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతులు నెహ్రూ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్పలు శుక్రవారం పర్యటన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీనుండి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజులు పర్యటిస్తారని దీనిలో భాగంగా 14వ తేదీన గోకవరం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడిసెంటర్ వద్ద ఇదే కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాలో పాల్గొంటారన్నారు. అక్కడనుండి జగ్గంపేటలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం టిడిపి అధ్యక్షులు మంగరౌతు రామకృష్ణ మాజీ జడ్పిటిసి పాలూరి బోసుబాబు గునిపే భరత్ ఈది అశోక్ అడపా భరత్ కుమార్ ఉంగరాల రాము గూండా శివప్రసాద్ మండిగ గంగాధర్ పోసిన ప్రసాద్ బత్తుల సత్తిబాబు  వెంకటపతి ఆచంట రాజు తదితరు టిడిపి నాయకులు పాల్గొన్నారు.