ప్రజాశక్తి-కడియం : కడియం నర్సరీ రంగం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందంటే అందుకు నర్సరీ రైతుల కృషి ఎంతో ఉందని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. భారత కళారత్న, గౌరవ డాక్టరేట్ పొందిన కడియం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు పుల్లా చంటియ్యను చందన సత్కరించారు. కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీకి వెళ్లి చంటి సేవలను కొనియాడారు. నర్సరీ రంగంలో ఎందరో ఆణిముత్యాలు లాంటివారు ఉన్నారని చందన పేర్కొన్నారు. అటువంటి వారిలో చంటియ్య ఒకరని, నర్సరీలో నిత్యం శ్రమిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆయనకు సరైన గౌరవం దక్కిందని కితాబిచ్చారు. చంటియ్యను అభినందించిన వారిలో మండల జెసిఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి, వైసీపీ నాయకులు కొత్తపల్లి శివాజీ, తిరుమలశెట్టి వాసు , సింగంశెట్టి శ్రీనివాసు తదితరులున్నారు.










