- సదుపాయల విషయంలో అధికారులతో చర్చలు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్: రాజమండ్రి రూరల్ స్థానిక ఆల్కట్ గార్డెన్స్ వద్ద గల మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక వైస్సార్సీపీ నాయకులతో కలిసి పరిశీలించి అక్కడ సదుపాయాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా రాజమండ్రికి గోదావరి వరద ఉదృతి అధికం కావడం వలన గోదావరి లంక గ్రామాలైన కేతా వారి లంక, వేదుమల్ల లంక, బ్రిడ్జ్ లంక వంటి ప్రాంతాలు ముంపునకు గురి కావడం వలన అక్కడి స్థానికులకు మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగానే పునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని సుమారు 300 మందికి పైగా వరద బాధితులను లంక గ్రామాలనుండి తరలించడం జరిగిందని వారికి అన్ని సదుపాయాలను అందజేస్తున్నాం అని తెలిపారు. పూర్తిగా వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వరద బాధితుల కోసం ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరద ప్రభావం తగ్గే వరకు ప్రధమ చికిత్స కేంద్రంలో ఆశ వర్కర్లు, ఎ.ఎన్.ఎమ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. బాధితులందరితో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవసరం ఉన్న అందరికి అందుబాటులో ఉంటానని వారికి తెలియజేసారు. బాధితులందరికి కూడా సమయానుగుణంగా భోజన వసతి సదుపాయలు ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందన నాగేశ్వర్ తో పాటుగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర, ఖాదీ బోర్డు కార్పొరేషన్ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, జేసీస్ ఇంచార్జి రాజమౌళి, మత్స్యెటి శివ, అంగాడా సత్యప్రియ, బిల్డర్ చిన్న,దమ్ము ప్రసాద్, దుంప చంద్రారెడ్డి, పడమట కామరాజు, పడమట నాగమణి, బాబ్జి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.










