Apr 17,2023 16:30

ప్రజాశక్తి - కడియం: రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్  కార్పొరేషన్ చైర్మన్ గా సోమవారం రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని గ్రీనింగ్ బోర్డ్ కార్యాలయంలో చందన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చందన నాగేశ్వర్, పర్వతవర్థిని దంపతులను దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. రూరల్ నియోజకవర్గ వైసీపీ ప్రధాన క్యాడర్, పలువురు కార్యకర్తల మధ్య చందన ఉత్సాహంగా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కడియం నర్సరీలకు అనుబంధంగా  ఉన్న ఇటువంటి గ్రీనింగ్ బోర్డు పదవి ఇవ్వటం పట్ల ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చందనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, కడియం మండలం వైసిపి అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, నాయకులు తాడాల చక్రవర్తి, తాటికొండ విష్ణు ,రాజమౌళి, డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, కార్పొరేషన్ డైరెక్టర్ లు భీమిరెడ్డి నాగేంద్ర, దొంతంశెట్టి వీరభద్రయ్య, సొసైటీ చైర్మన్ లు వెలుగుబంటి అచ్యుతరాం, ఈదర దీన్ దయాల్, తిరుమలశెట్టి శ్రీనివాస్, వ్యవసాయ కమిటీ చైర్మన్ ఈలి గోపాలం, సర్పంచ్ లు కొండపల్లి పట్టియ్య, బత్తుల నళిని రాము,  తదితరులు పాల్గొన్నారు.