ప్రజాశక్తి-చాగల్లు(తూగో) : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వీర్రాజు తెలిపారు. ఈనెల ఐదో తేదీన ఏలూరు సిఆర్ రెడ్డి కాంప్లెక్స్ లో జరిగిన జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ క్రికెట్ పోటీల్లో ఎం తేజ. ఎస్ గీత. పి సాయి తేజలు మంచి ప్రతిభ చూపి రాసొస్తాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వీళ్లకు శిక్షణ ఇచ్చిన పి ఈ టిి.మున్ని. పి.డి విజయలక్ష్మిలను. ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు గ్రామస్తులు పలువురు అభినందించారు.










