ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామ శివారులో బ్రహ్మాల కాలనీ వద్ద శిథిలావస్థకు చేరిన రోడ్డు స్థానంలో నూతనముగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊర కాలవ ఉధృతికి బ్రహ్మల కాలనీ రోడ్డు కోతకు గురై శిథిలవస్తుకు చేరింది అన్నారు. శిథిలవస్థకు చేరిన ఈ రహదారి స్థానంలో 5 లక్షల రూపాయలు వ్యయంతో నూతనముగా సిమెంట్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు నాయకులు వరసాల ప్రసాద్ ఎంపిటిసి తోలేటి రమ్య శ్రీ ప్రసాద్ నరాలశెట్టి నరసయ్య తదితరులు పాల్గొన్నారు










