Mar 20,2023 16:59

ప్రజాశక్తి-గోకవరం : అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం నలుగురు వ్యక్తులు అరెస్టు ఆయన సంఘటన గోకవరంలో చోటుచేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి. ఉభయ తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి ఎస్పీ శ్రీధర్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ సిహెచ్ పాపారావు రజిని దేశాలు మేరకు రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో గోకవరం ఎస్ఐ శివనాగు బాబు ఆధ్వర్యంలో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందని అందిన పక్కా సమాచారం మేరకు మండలంలోని కొత్తపల్లి గ్రామం పెద్ద చెరువు చాకలి రేవు వద్ద రామన్నపాలెం నుండి కొత్తపల్లి గ్రామం వెళ్లే రోడ్డు వద్ద నలుగురు వ్యక్తులు రాజనగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన పడాల కన్నబాబు రంపచోడవరం మండలం చిన్న బీరంపల్లి గ్రామానికి చెందిన మలగల బాలరాజు అడ్డతీగల మండలం భీముడుపాకల గ్రామానికి చెందిన కొనుతూరి కృష్ణ గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తడాల నాగరవితేజ్ లు స్కూటీ పల్సర్ బైక్ వాహనాలులో గంజాయి తరలించడానికి ప్రయత్నిస్తుండగా గోకవరం పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22కేజీల గంజాయి (విలువ 1 లక్ష 10 వేల)4500రూపాయ నగదు 3 సెల్ ఫోన్లు ఒక స్కూటీ ఒక పల్సర్ బైకు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని గోకవరం ఎస్సై శివనాగబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం తాసిల్దార్ ఏ శ్రీనివాస్ వీఆర్వో వెంకట్రావు వీఆర్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.