ప్రజాశక్తి- గోకవరం మండల కేంద్రమైన గోకవరంలో ఈ నెల 15న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ గోకవరం గ్రామంలో దేవీచౌక్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసిన నివాళులు అర్పిస్తారని, గుమ్మలదొడ్డి గ్రామం వద్ద మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారని చెప్పారు. అనంతరం కొత్తపల్లి మీదుగా రోడ్డు మార్గాన బయలుదేరి జగ్గంపేట వెళ్తారని తెలిపారు. జగ్గంపేటలో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత ప్రజలతో మాట్లాడుతారని తెలిపారు. రాత్రికి జగ్గంపేటలోనే బస చేస్తారని చెప్పారు. అనంతరం పెద్దాపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్‌విఎస్.అప్పలరాజు, మారిశెట్టి భద్రం మంగరౌతు రామకష్ణ పాలూరి బోసు బాబు ఈది అశోక్ గునిపే భారత్ అడపా భరత్ కుమార్ పోసిన ప్రసాద్ కన్నబాబు బత్తుల సత్తిబాబు మండిగ గంగాధర్ కొంగారపు రాజు ఆచంట రాజు పాల్గొన్నారు.










