Apr 18,2023 00:10

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కూల్‌ డ్రింక్స్‌ వద్దు.... సహజ పానీయాలే ముద్దు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఊరట కోసం అత్యధిక మంది కూల్‌ డ్రింక్స్‌ను సేవించటం పరిపాటి. తక్కువ ధరకు రావడం, తక్షణం ఉపశమనం లబించడం వంటి కారణాల వల్ల దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది. కూల్‌ డ్రింక్స్‌ వినియోగంతో ఆయుష్షు తగ్గుతుందా అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. మీరు తీసుకునే ప్రతి గ్లాసు శీతల పానీయం మీ ప్రాణాన్ని హరించే హాలాహలమని అనేక పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు. కూల్‌ ్డడ్రింక్స్‌ అతిగా తాగే వారికి మధుమేహం, ఒబేసిటీ సమస్యలతో పాటు కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నట్లు పరిశోధనల్లో తేలుతోంది. ఇప్పటికైనా కూల్‌డ్రింక్స్‌ వినియోగం తగ్గించకపోతే ప్రాణాలకే ముప్పు అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాగా, కూల్‌డ్రింక్స్‌ వినియోగం ముఖ్యంగా యువతలో మరీ ముఖ్యంగా చిన్నారుల్లో పెరగడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని కూల్డ్రింక్స్‌ వినియోగాన్ని తగ్గించక తప్పదు
కూల్‌ డ్రింక్స్‌తో ఎదురయ్యే దుష్పరిణామాలు
కూల్‌ డ్రింక్స్‌తో ఎదురయ్యే ఆరు రకాల ముప్పులు ఎదుర్కొవాల్సి వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ నిర్వహించిన స్టడీకి నేతృత్వం వహించిన పరిశోధకుడు నీల్‌ మర్పీ తెలిపిన వివరాల ప్రకారం.. శీతల పానీయాలు, సోడా ఆధారిత పానీయాల్లో అధిక మొత్తంలో కత్రిమ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు. కొంతమంది మంచి నీళ్ల కంటే కూల్‌ డ్రింక్సే ఎక్కువగా తాగుతుంటారు. కూల్‌ కూల్‌గా గొంతులోకి వెళ్తుంటే.. ఆ మజాయే వేరంటూ గుటక లేస్తారు. అయితే, ఆ అల వాటు.. ఆరోగ్యానికి చేటనే సంగతి మీకు తెలుసా.. ఇప్పటికే మనిషి సగటు ఆయష్షు సగానికి పడిపోయింది. మన పూర్వికులు చక్కని ఆహారం, పానీయాలతో వందేళ్ల వరకు జీవించేవారు. ఇప్పుడు 30 ఏళ్లకే పలువురు మంచాన పడుతున్నారు. గుండె సమస్యలు, డయాబెటీస్‌, శ్వాసకోస, కిడ్నీ సంబంధిత వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ పాపంలో శీతల పానీయాలు లేదా కూల్‌ డ్రింక్సుకు కూడా వాటా ఉంది. ఇటీవల జరిపిన పరిశోధనల్లో.. శీతల పానీయాలను ఎక్కువగా తాగేవారు త్వరగా అనారోగ్యాలకు గురౌతున్నారని తెలిసింది.
పరిశోధనలలో తేలింది... ఇలా...
తీపి లేని శీతల పానీయాలంటూ ఏవీ ఉండవు. వాటి రుచి కోసం అధిక చక్కెరను వినియోగిస్తారు. అది శరీర అవయవాలను నాశనం చేస్తుంది. ఫ్రాన్స్‌లోని 'ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌' నిర్వహించిన స్టడీకి నేతత్వం వహించిన పరిశోధకుడు నీల్‌ మర్ఫీ తెలిపిన వివరాల ప్రకారం... శీతల పానీయాలు మరణంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. సోడా ఆధారిత పానీయాల్లో అధిక మొ త్తంలో కత్రిమ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు. పరిశోధనలో ఏం తెలిందంటే.. గత కొన్నేళ్లుగా 10 యూరోపియన్‌ దేశాల్లో 452,000 మంది పురుషులు, మహిళలపై ఈ పరిశోధనలు సాగించారు. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల శీతల పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలసుకున్నారు. 16 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో కొన్ని కీలక విషయాలు తెలుసుకున్నారు. ఎవరెవరు ఏయే కారణాలతో చనిపోయారంటే.. అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 43 శాతం మంది క్యాన్సర్ల వల్ల 21.8 శాతం రక్త ప్రసరణ సమస్యల వల్ల, 2.9 శాతం జీర్ణ సంబంధిత వ్యాధుల వల్ల మరణించారు. శీతల పానీయాలు తాగడం ఎంత ప్రమోదమో చెప్పడానికి అధ్యయనం నిదర్శనమని తెలుస్తోంది. ఈ ఆరు ప్రమాదకర కారణాలు గురించి తెలుసుకుని అప్రమత్తత తప్పనిసరి
వినియోగం తగ్గించకపోతే తప్పదు భారీ మూల్యం
శీతల పానీయాలు తాగేందుకు బాగానే ఉంటాయి. కానీ, అవి స్లోపాయిజన్‌గా శరీరంలోకి చేరి వ్యాధులతో చంపేస్తాయి. శీతల పానీయాలు అతిగా తాగడం వల్ల ప్రధానం ఏర్పడే సమస్య డయాబెటీస్‌ (మధుమేహం) శీతల పానీయాల్లో ఉండే అధిక కేలరీలు మధుమేహానికి దారి తీస్తాయి. శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అవి క్రమేణా టైప్‌-2 డయాబెటీస్‌గా మారి జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తాయి. కూల్‌ డ్రింక్స్‌ అంతర్గత అవయవాలకే కాదు. దంతాలకు కూడా ప్రమాదకరమే. శీతల పానీయాల్లోని సోడాలో ఫాస్పోరిక్‌, కార్బోనిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అవి నోటిలో ఆమ్ల స్థాయిని పెంచుతాయి. ఫలితంగా దంత క్షయం ఏర్పడుతుంది. అంతేగాక, శీతల పానీయాల్లో ఉండే అధిక చక్కెర సైతం దంతాలను నానశం చేస్తాయి. నోటిలో చెడు బ్యాక్టీరియా వద్ధికి దారితీస్తుంది. శీతల పానీయాల్లో ఉండే కత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు ఏర్పడవచ్చు. శరీ రంలోకి చేరే అధిక చక్కెర వల్ల రక్త ట్రైగ్లిజరైడ్స్‌, దట్టమైన ఎల్డీఎల్‌ కణాలు దెబ్బ తింటాయి.