హోమంలో పాల్గొన్న డికె.శివకుమార్ తదితరులు
ప్రజాశక్తి - ఉండ్రాజవరం
మండలంలోని చిలకపాడులో సుందరేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మంగళవారం నిర్వహించిన హోమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె.శివకుమార్ పాల్గొన్నారు. తొలుత నూతనంగా నిర్మించిన దేవాలయ సముదాయాన్ని సందర్శించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట కర్ణాటక మంత్రి సుధాకర్, తణుకు మాజీ ఎంఎల్‌ఎ ఎ.రాధాకృష్ణ తదితర నాయకులు ఉన్నారు.










